సీఎం జగన్ ప్రజలను శిక్షించేవారిలా మారారు: బీజేపీ నేత లంకా దినకర్

  • నాడు ప్రజలకు అండగా ఉంటానని జగన్ చెప్పారు
  • జగన్ ప్రభుత్వానికి ప్రజలు తగినబుద్ధి చెబుతారు
  • ముంపు పేరిట అమరావతిని నిర్లక్ష్యం చేయొద్దు
నాడు ప్రజలకు అండగా ఉంటానని చెప్పిన జగన్, నేడు శిక్షించేవారిలా మారారని బీజేపీ నేత లంకా దినకర్ తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వానికి ప్రజలు ఎలా అయితే బుద్ధి చెప్పారో, అదే విధంగా జగన్ ప్రభుత్వానికి చెబుతారని అన్నారు.

 మంత్రులపై జగన్ కు ఏమాత్రం పట్టులేదని విమర్శించారు. పోలవరం, రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు విధానాలను అవలంబిస్తోందని, రివర్స్ టెండరింగ్ వల్ల వచ్చే సమస్యల గురించి పోలవరం అథారిటి చెప్పినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ముంపు పేరిట రాజధాని అమరావతిని నిర్లక్ష్యం చేయాలని చూస్తున్నారని, 29 గ్రామాల్లో ఎక్కడైనా ముంపునకు గురయ్యాయా? అని ప్రశ్నించారు. అమరావతి విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని అన్నారు.
Go Back to Shorts
CM
Jagan
Bjp
Lanka Dinakar

More Telugu News